కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్‌: కన్నా ట్వీట్‌ | Kanna Tweets On Kathi Mahesh And Paripoornananda Swamiji Episode | Sakshi
Sakshi News home page

కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్‌: కన్నా ట్వీట్‌

Jul 10 2018 8:31 PM | Updated on Sep 4 2018 5:44 PM

Kanna Tweets On Kathi Mahesh And Paripoornananda Swamiji Episode - Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ

సాక్షి, హైదరాబాద్‌ : లక్షలాది మంది హిందూవులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని హౌజ్‌ అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్‌ డేగా అభివర్ణించారు. కాగా, రాముడిని దూషిస్తూ కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్న పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఏ మతానికి చెందిన దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే స్వామి పాదయాత్ర తలపెట్టారన్నారు. ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. మన పాలన ఇలా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement