టీఆర్‌ఎస్‌లో చేరిన నటుడు | JL Srinivas Joins TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన జేఎల్‌ శ్రీనివాస్‌

Sep 8 2018 11:20 AM | Updated on Sep 8 2018 11:21 AM

JL Srinivas Joins TRS - Sakshi

విలేకరుల సమావేశంలో జేఎల్‌ శ్రీనివాస్‌

తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. టీవీ, ఫిలిం యాక్టర్, హైకోర్టు అడ్వకేట్‌ జే.ఎల్‌. శ్రీనివాస్‌ కుందన్‌బాగ్‌లోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఖమ్మం జిల్లాకు చెందిన తాను గత 30 సంవత్సరాలుగా నగరంలో నివాసం ఉంటూ సుమారు 200 పైగా సినిమాలు, ఎన్నో సీరియల్స్‌లో విభిన్న పాత్రలు పోశించినట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ కోసం ఆయన వేస్తున్న బాటలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీవీ సీరియల్‌ కళాకరులతో కలిసి 31 జిల్లాల్లో విసృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement