కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

High Court Issues Notice To CM KCR Over Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌ దాఖలైంది. కేసీఆర్‌పై 64 క్రిమినల్‌ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గజ్వేల్‌ కు చెందిన శ్రీనివాస్‌ అనే ఓటర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్‌ను ఎమ్మెల్యే‌గా అనర్హుడు‌గా ప్రకటించాలని శ్రీనివాస్‌ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top