ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి

Hans Raj Hans Wants JNU To Be Renamed MNU - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్‌ హన్స్‌ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ(జేఎస్‌యూ) పేరును మర్చాలని సూచించారు. దాని పేరును మోదీ నరేంద్ర యూనివర్సిటీగా(ఎంఎన్‌యూ) మార్చాలని కోరారు. శనివారం జేఎన్‌యూను సందర్శించిన హన్స్‌రాజ్‌ అక్కడ ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు హన్స్‌రాజ్‌ తెలిపారు. పూర్వీకులు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అలాగే జేఎన్‌యూ పేరును ఎంఎన్‌యూగా మర్చాలని సూచించారు. మోదీ పేరు మీద కూడా ఏదో ఒకటి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 1969లో ఏర్పాటైన జేఎన్‌యూకు.. భారత ప్రథమ ప్రధాని జవహరలాల్‌ నెహ్రు పేరు పెట్టడం జరిగింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top