బెదిరింపులతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు: గండ్ర | Gandra Venkataramana Reddy commented over trs | Sakshi
Sakshi News home page

బెదిరింపులతోనే టీఆర్‌ఎస్‌ గెలుపు: గండ్ర

Oct 7 2017 2:38 AM | Updated on Oct 7 2017 2:38 AM

Gandra Venkataramana Reddy commented over trs

సాక్షి, హైదరాబాద్‌: మద్యం, డబ్బు, ఫిరాయింపులు, కార్మిక నేతలను బెదిరించడం వంటి చర్యలతో టీఆర్‌ఎస్‌ సింగరేణి ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదన్నారు.

టీఆర్‌ ఎస్‌ అనుబంధ సంఘానికి ఓటేయాలంటూ సింగరేణి అధికారులు కార్మికులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెండి గ్లాసులు పంచారని, ఓటుకు రూ. 10వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. అధికార టీఆర్‌ఎస్‌ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన కార్మిక సంఘానికి కార్మికులు భారీగా ఓట్లేశారని గండ్ర చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement