ఔరా.. అవినీతి చక్రవర్తి!

Extended discussion on Chandrababu Govt At Prajasankalpayatra Closing program - Sakshi

పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో అవినీతి చక్రవర్తిపై విస్తృత చర్చ

రెండు గంటల్లోనే వేలాది కాపీలను దక్కించుకున్న ప్రజలు 

పుస్తకాల్లోని అంశాలపై సోషల్‌ మాధ్యమాల్లో పోస్టులు 

కంచిలి/కవిటి: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ప్రజా సంకల్ప యాత్రలో హైలెట్‌గా మారింది. పాదయాత్రకు వచ్చిన ప్రజలు ఈ పుస్తకాలను ఎవరికివారుగా వచ్చి తీసుకుని.. ఆద్యంతం ఆసక్తిగా చదవడం కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలు.. నిర్వాహకుల నుంచి ఈ పుస్తకాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కేవలం రెండు గంటల్లోనే వేలాది కాపీలను దక్కించుకున్నారు. ఈ పుస్తకంలో వివరించిన అవినీతి బాగోతాలపై ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టడంతో క్షణాల్లోనే అవి ప్రపంచం నలుమూలలకు చేరాయి. పుస్తకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిలో ప్రచురించిన 143 అంశాలను ఆసక్తి చదవడం కనిపించింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతి, లక్షల కోట్ల దోపిడీ, అమరావతి ఒక అంతర్జాతీయ కుంభకోణం, తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వైనం.. తదితర అంశాలను ఈ పుస్తకం సాక్ష్యాధారాలతో సహా వివరించిందని పలువురు పేర్కొన్నారు. సరైన సమయంలో పుస్తకాన్ని విడుదల చేశారని పలువురు కితాబిచ్చారు. 

దోపిడీ, అవినీతి పాలనను కళ్లకుకట్టింది 
నాలుగున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, దోపిడీ పాలనను ఈ పుస్తకం కళ్లకుకట్టింది. ఏ ఏ రంగంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో.. శాఖాపరమైన జీవోలను ఉటంకిస్తూ ఆధారాలతో సహా తెలియజేసింది. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఈ పాలనపై అసహ్యం వేస్తోంది. 
– బట్టి మాధవరావు, మత్స్యకార ఐక్యవేదిక నాయకుడు, శ్రీకాకుళం 

ఆధారాలతో వివరించిన తీరు అద్భుతం 
వరి ఉత్పత్తిలో అత్యంత కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పచ్చని పంటపొలాలను రైతుల నుంచి లాక్కున్న తీరు దారుణం. నిబంధనలు తోసి రాజని భూదందా నిర్వహించిన విధానం చాలామంది ప్రజలకు పూర్తిగా తెలియని విషయం. ఆయా అంశాలను ‘అవినీతి చక్రవర్తి’లో ఆధారాలతో సహా వివరించిన తీరు అద్భుతం. 
– మర్రెడి సాంబిరెడ్డి, నిడమర్రు, గుంటూరు జిల్లా.

తవ్వేకొద్ది అవినీతి.. చంద్రబాబుది 
చంద్రబాబు చేసిన అవినీతి తవ్వేకొద్ది మరింత బయటపడుతోంది. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని అట్టడుగు వర్గాలకు సైతం ఈ పుస్తకం ద్వారా తెలియజేసే అవకాశం దక్కినట్టయింది.
– శెట్టి రవీంద్రబాబు, అరకు, విశాఖపట్నం జిల్లా 

మరిన్ని వార్తలు

10-01-2019
Jan 10, 2019, 07:30 IST
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా...
10-01-2019
Jan 10, 2019, 07:27 IST
శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు...
10-01-2019
Jan 10, 2019, 07:21 IST
శ్రీకాకుళం : ధర్మపురం గ్రామంలో సాగునీటి కాలువను అభివృద్ధి చేయాలి. 2000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పనులు...
10-01-2019
Jan 10, 2019, 07:18 IST
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిచేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసింది. పేదలకు తమకంటూ ఓ...
10-01-2019
Jan 10, 2019, 04:10 IST
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంటికొచ్చిన చుట్టాన్ని వీడ్కోలు పలికే సమయంలో హృదయం బరువెక్కుతుంది.. కళ్ల వెంట...
10-01-2019
Jan 10, 2019, 04:03 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనం ఏదైనా చిన్న కార్యక్రమం తలపెడితే ఎన్నో ప్రణాళికలు, మరెన్నో...
10-01-2019
Jan 10, 2019, 03:49 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఓ వైపు 16వ నంబర్‌ జాతీయ రహదారి.. మరోవైపు...
10-01-2019
Jan 10, 2019, 03:40 IST
(ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తూరుపు దిక్కున మబ్బులు ఎర్రబారుతున్నాయి.. అప్పుడప్పుడే మంచు తెరలు విచ్చుకుంటున్నాయి.....
10-01-2019
Jan 10, 2019, 03:30 IST
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మకమైన రీతిలో సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర...
10-01-2019
Jan 10, 2019, 02:23 IST
రాష్ట్రంలోని ప్రతి సమస్య మీదా ఇవాళ నేను పూర్తి అవగాహనతో ఉన్నానని మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అందుకే ప్రతి పేదవాడికీ...
10-01-2019
Jan 10, 2019, 02:10 IST
‘మీ అందరికీ నేనొక్కటే చెబుతున్నా.. నేను 3,600 కిలోమీటర్లకు పైగా నడిచా.. దారిపొడవునా ప్రతి పేదవాడి కష్టం చూశా.. ప్రతి...
10-01-2019
Jan 10, 2019, 01:45 IST
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,648 కిలోమీటర్లు 341వ రోజు నడిచిన దూరం: 9.1 కిలోమీటర్లు 09–01–2019, బుధవారం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా రాజన్న రాజ్యాన్ని...
09-01-2019
Jan 09, 2019, 19:44 IST
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను...
09-01-2019
Jan 09, 2019, 19:28 IST
సాక్షి, ఇచ్చాపురం : అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌...
09-01-2019
Jan 09, 2019, 17:30 IST
పాదయాత్రలో.. చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు..
09-01-2019
Jan 09, 2019, 16:09 IST
సాక్షి, ఇచ్చాపురం:  ‘నిన్నటి దినం ప్రజాసంకల్ప యాత్ర.. రేపు వైఎస్‌ జగన్‌ పట్టాభిషేక యాత్ర. ఈ ప్రజాసంకల్పయాత్ర ఇంత పెద్దఎత్తున విజయవంతం...
09-01-2019
Jan 09, 2019, 15:06 IST
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను వైఎస్సార్‌...
09-01-2019
Jan 09, 2019, 14:38 IST
జనంతో ఇంతగా కలిసిపోయే నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని..
09-01-2019
Jan 09, 2019, 14:14 IST
ఓ వైపు తరలివచ్చిన లక్షలాది జనం.. మరో వైపుఅడుగడుగునా అభిమాన నేతకు ఆశీర్వచనం..ఎటు చూసినా ఉప్పొంగిన అభిమాన తరంగం.. ఇది2017...
09-01-2019
Jan 09, 2019, 14:05 IST
అసమర్థ పాలనను ఎండగడుతూ.. అభ్యాగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్పయాత్రికుడు  జిల్లాలో అడుగు పెట్టింది మొదలు.. ఊరూరా జనంనీరాజనం పలికారు. పేదల...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top