టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా | Ex MLC Mettu Govinda Reddy Resigns To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. గోవిందరెడ్డి రాజీనామా

Mar 12 2019 2:37 PM | Updated on Mar 12 2019 3:50 PM

Ex MLC Mettu Govinda Reddy Resigns To TDP - Sakshi

సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు నాయుడు వైఖరిపై అసహనం, రాయదుర్గం టికెట్‌ను మరోసారి మంత్రి కాలవ శ్రీనివాస్‌కు కేటాయించడంపై అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గోవింద రెడ్డిని బుజ్జగించేందుకు ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, మంత్రి కాలవ శ్రీనివాస్‌ రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మనస్తాపంతో టీడీపీకి రాజీనామా చేశారు.మరోవైపు రాయదుర్గం టికెట్‌ను మంత్రి కాలువ శ్రీనివాస్‌కు కేటాయించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు.

(ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement