జేసీ దివాకర్‌రెడ్డి కళాశాలలో...

Elections  Checking In JC Diwakar Reddy Colleges - Sakshi

యాడికి: తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు సిద్ధం చేశారని సమాచారం అందడంతో తహసీల్దార్‌ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవిన్యూ సిబ్బందితో శనివారం సాయంత్రం యాడికి మండల పరిధిలోని జేసీ దివాకర్‌రెడ్డి జూనియర్‌ కళాశాలను తనిఖీ చేశారు. అయిగే గదులు తాళాలు వేసి ఉండటంతో వీఆర్వో పవిత్ర ప్రిన్సిపల్‌ను ఫోన్‌లో సంప్రదించారు.

తాను బెంగళూరులో ఉన్నానని, తాళంచెవులు తాడిపత్రిలోని తన ఇంటిలో ఉన్నాయని చెప్పాడు. ఈ మేరకు సిబ్బంది తాడిపత్రికి వెళ్లి తాళంచెవులు తీసుకొచ్చారు. ఇందులో ఒక గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. ప్రిన్సిపల్‌ రూము, మరో గదికి సంబంధించిన తాళంచెవులు లేకపోవడంతో వాటిని తెరవలేకపోయారు.

ఈ గదుల తాళాలను తర్వాతైనా తెరిచి పరిశీలించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ను సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉండగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనిఖీల సమయంలో తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి.. తమ కళాశాల గదులను తెరవవద్దని, ఒక వేళ కాదు అని తెరిస్తే మీ మీద కోర్టులో కేసు వేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మరి ప్రిన్సిపల్‌ గదిని తెరుస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top