సీఎం జగన్‌కు ధన్యవాదాలు: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

Duddukunta Sreedhar Reddy Thanked CM YS Jagan Over Rythu Bharosa In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని.. ఆయన అధికారంలోకి రాగానే సీమలో వర్షాలు కురిశాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని.. రైతులకు ఆయన అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.(రింగ్‌ దాటితే చర్యలు తీసుకోండి: సీఎం జగన్‌)

గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం: చెవిరెడ్డి
రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ స్వయంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారని... అందుకే వారికోసం వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top