
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లోఫర్ల పార్టీ అయితే, గతంలో ఈ పార్టీలో పనిచేసిన కేసీఆర్ కూడా లోఫరేనా? అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారమదంతో మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ జన్మను ఇచ్చిన కాంగ్రెస్‌ను లోఫర్ల పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడటం నీచమన్నారు. రాహుల్ దద్దమ్మ అయితే, ఆయన ఇంటికి కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లారో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు.