‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 మాసాల్లో పడిపోతుంది’ | Congress MLA Komatireddy Rajagopal Reddy Slams KCR In Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం’

May 7 2019 4:39 PM | Updated on May 7 2019 4:39 PM

Congress MLA Komatireddy Rajagopal Reddy Slams KCR In Yadadri Bhuvanagiri District - Sakshi

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(పాత చిత్రం)

యాదాద్రి భువనగిరి జిల్లా : కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతిని బట్టబయలు చేసి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాక్యానించారు. మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఆరు మాసాల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోబోతుందని జోస్యం చెప్పారు.

రానున్న రోజుల్లో తెలంగాణాలో కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రఖజానాలో డబ్బులు లేవు.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వముందని విమర్శించారు. 2023లో ఆలేరులో కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement