
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎల్పీ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎల్పీ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ కార్యక్రమాలను మార్పు చేస్తున్నారన్నారు. ఖజానాపై రూ. 20 కోట్ల భారం పడిందన్నారు. మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టు తరలింపుతో మూడు లిఫ్ట్‌లు అవసరమవుతున్నాయని, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఒకటే లిఫ్ట్ అవసరం వచ్చేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం కోల్పోయామన్నారు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.