‘ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్‌కి కరోనాలా తగిలాయి’

Congress Defeat in Delhi Polls Like Coronavirus: Jairam Ramesh - Sakshi

కొచ్చి: మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్‌ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్‌బాగ్‌ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్‌కేనని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్‌ సోకినట్టుగా భారీగా నష్టం జరిగిందన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్‌ రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  (చదవండి: అలాంటి మాటలు వాడకుంటే బావుండేది)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top