సీఆర్‌డీఏపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష | CM YS Jagan Mohan Reddy Review on CRDA | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీఏపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Jun 26 2019 5:14 PM | Updated on Jun 26 2019 7:38 PM

CM YS Jagan Mohan Reddy Review on CRDA - Sakshi

సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి పరిధిలోని అక్రమ నిర్మాణాలు, బలవంతపు భూసమీకరణతో పాటు, రాజధానికి నిర్మాణాలకు  సంబంధించిన పలు అంశాలు ఈ సమీక్షలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతం మొత్తం అవినీతి కూపంలా ఉందని బొత్స విమర్శించారు. అమరావతిలో ఏది ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోందని, రాజధాని వ్యవహారాల మరింత లోతుగా పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ  వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్ణయిస్తామని.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు.
(చదవండి: అవినీతి కూపంలా రాజధాని ప్రాంతం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement