‘చంద్రబాబు తన జీవితకాలంలో పూర్తి చేయలేరు’ | chinta mohan takes on chandrababu niadu over ap capital | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో సినిమా గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు..

Oct 26 2017 9:04 AM | Updated on Aug 18 2018 5:48 PM

chinta mohan takes on chandrababu niadu over ap capital  - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో సినిమా గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని పెట్టుబడులు తెచ్చారో వెల్లడించాలని  చంద్రబాబును డిమాండ్‌ చేశారు. ఎక్కడ డబ్బుంటే అక్కడ చంద్రబాబు ఉంటారని విమర్శించారు. రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసన్మానాల పేరుతో ప్రజా«ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటితో ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. అసలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది చంద్రబాబేనన్నారు.

మరోవైపు లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజధాని డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో విడతల వారీగా సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణశైలి, డిజైన్లు అసాధారణ రీతిలో, అపూర్వంగా ఉండాలని ఆయన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు సూచించారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నచ్చేలా రాజధాని డిజైన్లు ఉండాలని, అలా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement