
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే విజయ్‌కుమార్ (తాజా చిత్రం)
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్(60) ప్రచారం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం సాయంత్రం జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతంలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావటంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1 గం. ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, సివిల్ ఇంజనీర్ అయిన విజయ్‌కుమార్ అవివాహితుడు. జయనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి నామినేషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, విజయ్ సేవలను కొనియాడుతూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Sri BN Vijay Kumar, Jayanagar's popular 2 term MLA & BJP candidate passed away last night due to cardiac arrest. His humility, dedication & commitment to party and people will be remembered. A great loss for us. Our condolences to his family.
— BJP Karnataka (@BJP4Karnataka) 4 May 2018
We pray for his Sadgati. #OmShanti pic.twitter.com/EcAivkgtt4