రాహుల్‌ అఫిడవిట్‌ క్షుణ్నంగా చూస్తున్నాం | BJP claims Rahul Gandhi assets rose from Rs 55 lakhs to Rs 9 crore | Sakshi
Sakshi News home page

రాహుల్‌ అఫిడవిట్‌ క్షుణ్నంగా చూస్తున్నాం

Mar 25 2019 4:09 AM | Updated on Mar 25 2019 4:09 AM

BJP claims Rahul Gandhi assets rose from Rs 55 lakhs to Rs 9 crore - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ‘2004లో రూ.55 లక్షలు మాత్రమే ఉన్న రాహుల్‌ ఆదాయం 2014లో అందజేసిన అఫిడవిట్‌ ప్రకారం రూ.9 కోట్లకు చేరుకుంది. ఎటువంటి ఆదాయ వనరులు లేని, వృత్తి నిఫుణుడు కాని ఎంపీ ఆదాయం ఒక్కసారిగా ఎలా పెరుగుతుంది? ఇదంతా కుంభకోణాలు, తెరచాటు ఒప్పందాల ద్వారా సమకూరిందే. వీటి వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వకుండా రాహుల్‌ దాచిపెట్టారు’ అంటూ పాత్రా ఆరోపించారు. రాహుల్‌ గాంధీ అవినీతిపై ఇకనుంచి ప్రతి రోజూ మీడియాకు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాహుల్, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు చెందిన రూ.4.69 కోట్ల విలువైన ఢిల్లీలోని ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్న సంస్థ కూడా ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడిందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement