ఎంఐఎం వ్యాఖ్యాలను ఖండించాలి: కృష్ణసాగర్‌ రావు

BJP Chief Spokesperson Krishna Sagar Rao Slams On Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మారాయన్నారు. భారతదేశం నడి బొడ్డున ఎంఐఎం మీటింగ్‌లో ఒక అమ్మాయి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేసిందని, గతంలో ఎంఐఎం సీనియర్‌ నేత వారీస్‌ పఠాన్‌ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్‌ అని చెప్పుకునే కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు ఎక్కడకు వెళ్లారని ధ్వజమెత్తారు. భారతదేశ ముస్లీంలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను.. ఎంఐఎం పార్టీ వ్యాఖ్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్‌ జెండా అంటూ కృష్ణ సాగర్‌ విమర్శించారు.

సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top