టీడీపీ అంటే గౌరవం ఉండేది కానీ..

BJP Candidate Babu Mohan Slams Congress And TRS In Sanga Reddy - Sakshi

సంగారెడ్డి: టీడీపీ అంటే తనకు గౌరవం ఉండేది..కానీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని ఆంథోల్‌ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్‌ తెలిపారు. సంగారెడ్డిలో బాబూమోహన్‌కు ఓయూ జేఏసీ విద్యార్థులు మద్ధతు పలికారు. ఎన్నికల్లో బాబు మోహన్‌ తరపున ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బాబూ మోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నియోజకవర్గానికి రూ.50 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

కొడుకు, కూతురు కోసం సింగూర్‌ని కేసీఆర్‌ ఖాళీ చేశారని ఆరోపించారు.  క్రాంతి కిరణ్‌ అనే దళారికి టికెట్‌ ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పుట్టి అక్కడే చదివి అక్కడే ఉండే వ్యక్తి ఆంథోల్‌లో లోకల్‌ ఎలా అవుతారని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ని తిట్టరాని తిట్లు తిట్టిన వారికి మంత్రి పదవులిచ్చారని, మళ్లీ వాళ్లకే టికెట్‌ ఇచ్చారు...మరి నేనేం అపరాధం చేశారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top