ఉద్రిక్తంగా మారిన బీజేపీ, కాంగ్రెస్‌ ర్యాలీలు | BJP And Congress Clash In Gov | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా మారిన బీజేపీ, కాంగ్రెస్‌ ర్యాలీలు

Dec 22 2018 12:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

BJP And Congress Clash In Gov - Sakshi

పనాజీ: గోవాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాఫెల్‌పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనాజీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. రాఫెల్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో ర్యాలీని చేపట్టింది. ఇరువర్గాలు ఎదురుపడటంతో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement