‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’ | Ap Minister Kalva Srinivasulu Talk About Karnataka Assembly Elections | Sakshi
Sakshi News home page

‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’

May 15 2018 5:17 PM | Updated on Aug 27 2018 8:44 PM

Ap Minister Kalva Srinivasulu Talk About Karnataka Assembly Elections - Sakshi

సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల విజయం గురించి ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అదే కర్ణాటకలో జరిగిందని అన్నారు. అక్కడ బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్‌ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే అని తేల్చి చెప్పారు. బీజేపీకి వచ్చింది కేవలం 36 శాతం ఓట్లు మాత్రమేనని, ప్రజా వ్వతిరేఖ నిర్ణయాల వల్లే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు మోదీ నియంతృత్వ విధానాల పట్ల విసిగిపోయారని తెలిపారు. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిసింది. ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు. 

కర్ణాటకలో బీజేపీ సంఖ్యా పరంగా గెలిచినా.. ఓట్ల పరంగా ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు అన్నారు. 60 శాతానికి పైగా కన్నడ ప్రజలు బీజేపీని వ్యతిరేఖించారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement