చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

AP Budget 2019 Ambati Rambabu Satires On Ex CM Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై అంబటి సెటైర్లు

సాక్షి, అమరావతి : శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణానది కరకట్టపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతపై గురువారం సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ‘చట్టాలను ఎన్నటికీ అతిక్రమించను. సభాసంప్రదాయాలు పాటిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపట్ల అంబటి చురకలంటించారు. 

‘చంద్రబాబు మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోతోంది’ అని అనడంతో సభలో నవ్వులు పూసాయి. సీఎం స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా ఈ విధమైన మాటలు చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 23  మంది  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇవన్నీ చేసికూడా సభా నియమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉపన్యాసాలిస్తున్నారు. శభాష్‌ చంద్రబాబు’ అని అంబటి వ్యాఖ్యానించారు.  లింగమనేని అక్రమ కట్టడంలో నివాసముంటున్న ఆయన అక్కడ నుంచి ఖాళీ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top