రాజీనామా బాటలో అన్నాడీఎంకే ఎంపీలు | AIADMK MP to resign on Cauvery issue | Sakshi
Sakshi News home page

రాజీనామా బాటలో అన్నాడీఎంకే ఎంపీలు

Apr 2 2018 3:53 AM | Updated on Apr 8 2019 7:05 PM

AIADMK MP to resign on Cauvery issue - Sakshi

ముత్తుకరుప్పన్‌

సాక్షి, చెన్నై: కావేరీ అంశంలో కేంద్రం తీరుకు నిరసనగా తమిళనాడులో కొందరు అన్నా డీఎంకే ఎంపీలు రాజీనామాకు సిద్ధమవుతు న్నారు. కావేరి ట్రిబ్యునల్‌ తీర్పును తుంగలో తొక్కేలా కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారు రాజీనామాల బాట పడుతున్నట్లు తెలుస్తోంది.

సోమవారం తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు సమర్పిస్తానని ఎంపీ ముత్తుకరుప్పన్‌ ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొందరు ఎంపీలూ ఉన్నారు. మరోవైపు అన్నాడీఎంకే సీనియర్‌ ఎంపీ, తంబిదురై మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మద్దతిస్తే కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మద్దతిస్తామని సోనియా, రాహుల్‌ ప్రకటించాలని, కాంగ్రెస్‌ జత కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం సాధ్యమవుతుందని, అందుకు సిద్ధమేనా? అని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement