హెలెన్ తుఫాను దెబ్బకు కోనసీమ అతలాకుతలం | Cyclone helen creates havoc in east godavari district, 6 people lose lives | Sakshi
Sakshi News home page

హెలెన్ తుఫాను దెబ్బకు కోనసీమ అతలాకుతలం

Nov 22 2013 5:03 PM | Updated on Sep 2 2017 12:52 AM

హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది.

రాష్ట్ర చరిత్రలో అత్యంత విషాదాంతంగా చెప్పుకునే దివిసీమ ఉప్పెన తరువాత అతి పెద్ద ప్రళయం నవంబరు ఆరు తుపానే. అంతులేని ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైన ఈ తుపాను వచ్చినే నవంబరు నెలంటనే కోనసీమ వాసులు ఇప్పటికీ అందోళన చెందుతుంటారు. సరిగా 17 ఏళ్ల తరువాత ఇదే నెలలో వచ్చిన హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement