రాష్ట్రంలో ఎంత కావాలంటే అంత ఇసుక ఎప్పు డైనా సరే సరఫరా చేసే పద్ధతి గతంలో ఉండేది.
రాష్ట్రంలో ఎంత కావాలంటే అంత ఇసుక ఎప్పు డైనా సరే సరఫరా చేసే పద్ధతి గతంలో ఉండేది. అయితే గత ప్రభుత్వ సీనరేజి పాటలు నిర్వ హించకపోవటంతో ఇసుక మాఫియా తెరమీద కొచ్చింది. అప్పట్లో రెండు యూనిట్ల లారీ పది హేను వందల రూపాయలకు సరఫరా చేయగా ప్రస్తుతం పది, పదిహేను వేలు వెచ్చించాల్సివ స్తుంది.
జలవనరులు, రెవెన్యూ, గనులు, పంచాయతీరాజ్, పోలీ సు శాఖల నిరంతర పర్యవేక్షణలో నిఘా నేత్రాలు, లారీలను జి.పి. ఎస్. పరికరాల అమరికల వంటి పటిష్ట బందోబస్తు విధించినా మాఫియా ఆగడా లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గతంలో మాదిరిగా సీనరేజి పాటలు నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఆదాయంతో పాటు వినియోగదారు లకు సక్రమమైన ధరకు ఇసుక లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దీనిపై దృష్టి పెట్టకపోతే మాఫియా ఆగడాలు విజృంభించక తప్పదు.
- ఎర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం