మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం రద్దు అవశ్యం | Medical riyimbarsment procedure deemed necessary to cancel | Sakshi
Sakshi News home page

మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం రద్దు అవశ్యం

Oct 30 2015 12:31 AM | Updated on Aug 15 2018 9:30 PM

మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం రద్దు అవశ్యం - Sakshi

మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం రద్దు అవశ్యం

గత సంవత్సరం నవంబర్ నెలలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వహస్తాలతో ఉద్యోగ సంఘ నాయకులకు హెల్త్‌కార్డులు అందజేసి, నగదు రహిత వైద్య చికిత్సలకు నాంది పలికారు.

గత సంవత్సరం నవంబర్ నెలలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వహస్తాలతో ఉద్యోగ సంఘ నాయకులకు హెల్త్‌కార్డులు అందజేసి, నగదు రహిత వైద్య చికిత్సలకు నాంది పలికారు. దాంతో ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆనందానికి అవధు ల్లేవు. దాదాపు ఏడేళ్ల నుంచి నానుతున్న సమస్య పరిష్కారమైనదని అంతా సంతోషపడ్డారు. ఇక మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం ఆ నెలాఖరువరకే అమలులో ఉంటుందని ఉత్తర్వులిచ్చారు.

 కానీ నెల తిరగకముందే ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా హెల్త్‌కార్డులను అనుమతిం చలేదు. తద్వారా, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతిని ధులతో సంప్రదింపులు మొదలుపెట్టింది.

ఇంకా ఇప్పటికీ చర్చలు జరుపుతూనే ఉంది. కాని పది నెలలు గడిచినా ఫలవంతం కావడంలేదు. ఈలోగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని మూడు సార్లు పొడిగించారు. మొదలు ఈ సంవత్సరం మార్చి నెల 30 వరకు మల్లీ జూన్ నెల 30వ తేదీ వరకు, ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. తద్వారా, కార్పొరేట్ హాస్పి టల్స్‌లో నగదు రహిత వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్సలు కాని ఎండమావిగా తయారయ్యాయి. మరీ ముఖ్యంగా రిటైర్డు ఉద్యోగులకు ఇది పెనుశా పంగా తయారైంది. వైద్య చికిత్సలకు లక్షల్లో నగదు చెల్లించలేని అశక్తత ఒకవైపు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులను వృద్ధాప్యంలో సొంతంగా తయా రుచేసి పంపడం చేతగాని దీనావస్థ మరొకవైపు వీరికి చాలా ఇబ్బందిగా పరిణమించింది. ఒకవేళ ఓర్పుతో వాటిని తయారు చేసి పంపినా, ఏళ్ల తర బడి అవి మంజూరు కాకపోవడం వలన సత్వరం చేతికి డబ్బు అందని అయోమయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్నారు.


 ఉదాహరణకు 2010-2011 సంవత్సరాల్లో రెండు వేర్వేరు మెడికల్ రీయింబర్స్‌మెంటు బిల్లు లను నేను పంపితే నాలుగేళ్లు గడిచినా మంజూరు కాలేదు. ఏ అధికారికి ఉత్తరం రాసినా పట్టించుకో లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగే వయసూ కాదు. విసిగి వేసారి లోకాయుక్తకు, తరవాత ఆర్టీఐకి దరఖాస్తు చేయగా విద్యా శాఖాధికారులను మందలిస్తే గానీ మేల్కొనని విద్యాశాఖ ఎట్టకేలకు ఈ యేడు జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డబ్బు నాచేతికి అందడానికి మరో రెండునెలల కాలం పట్టింది. ఎంతమంది రిటైర్డు ఉద్యోగులకు ఇలా రాజ్యాంగ సంస్థలను ఆశ్రయించి లబ్ధి పొందే అవకాశం ఉం టుంది? మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల మం జూరీ వ్యవహారం ఇంత అధ్వానంగా తయారై ఉండగా అదే విధానాన్ని రిటైర్డు ఉద్యోగులపై రుద్దు తామంటే ఎలా? పైగా సీనియర్ పౌరులకు మెడికల్ రీయింబర్స్ బిల్లులను తయారు చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

దాదాపు 20 ధ్రువ పత్రాలను జత పర్చి, నాలుగైదు ప్రతులను (సెట్స్) తయారు చేసి పంపవలసి ఉంటుంది. అంటే ఐదు సెట్లలోని వంద ధ్రుపపత్రాలపై తాను సంతకం చేసి పక్కన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. ఇలా వంద పత్రాలపై సంతకం చేయడానికి ఏ గెజిటెడ్ ఆఫీసరైనా ఒప్పుకుంటారా? కాబట్టి మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తే హెల్త్‌కార్డుల అమలు శీఘ్రతరమవుతుంది. ఔట్ పేషెంట్ల వైద్య చికిత్సలకూ, రోగుల వైద్య చికిత్స లకూ హెల్త్‌కార్డుల ద్వారా నగదు రహిత వైద్యమే అనుసరణీయం. ఉద్యోగులు, రిైటైర్డు ఉద్యోగుల వేతనాల నుంచి సముచిత ప్రీమియంలను వసూలు చేసి హెల్త్‌కార్డులను సత్వరంగా అమలులోనికి తెస్తే అభ్యంతరాలు ఉండవు. ఈ సమస్యను ఇంకా ఇంకా వాయిదాలు వేస్తూ పోతే ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే అపనమ్మకం ఏర్పడుతుంది.


 బెంజరం భూమారెడ్డి  రిటైర్డ్ హెడ్‌మాస్టర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మాజీ అసోసియేట్ ప్రెసిడెంట్, నిజామాబాద్. మొబైల్: 99083 70720

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement