
గ్రహం అనుగ్రహం, మంగళవారం 8, సెప్టెంబర్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి బ.దశమి ఉ.6.15 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం పునర్వసు పూర్తి
వర్జ్యం సా.5.47 నుంచి 7.25 వరకు
దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.08 వరకు
తదుపరి రా.10.48 నుంచి 11.36 వరకు
అమృతఘడియలు తె.3.36నుంచి 5.14వరకు
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం: 6.07
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: ఉద్యోగ, విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
వృషభం: మిత్రులతో అకారణంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. పనులు వాయిదా.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
సింహం: శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. భూ, వాహన యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య: బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. భూలాభాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.
తుల: బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు. ధన వ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. సోదరుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి.
మకరం: ధూరపు బంధువులను కలుసుకుంటారు. దనలాభం. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆస్తి లాభం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కుంభం: పనుల్లో ఆటంకాలు కలుగుతాయ. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
మీనం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
- సింహంభట్ల సుబ్బారావు