జీఎం వంగడాలపై గోప్యమేల?

జీఎం వంగడాలపై గోప్యమేల?


విశ్లేషణ

జన్యుపరంగా మెరుగుపర్చిన వంగడాలపై కేంద్ర పర్యావరణ శాఖ గోప్యత పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. భారత్‌లోకి బీటీ వంగడాల ప్రవేశానికి జన్యుపరంగా మెరుగుపర్చిన ఆవ విత్తనం నాంది పలకనుండటం ప్రమాదఘంటికలను మోగిస్తోంది.

 

 ఇండియాలో జన్యుపరంగా రూపొందించిన కొత్తరకం ఆవ పంట సాగుకోసం ఒక రహస్య అప్లికేషన్‌ను రూపొందిం చారు. భారతీయ జెనెటిక్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ (జీఈఏసీ) ఈ కొత్త అప్లికేష న్‌ను ఆమోదించినట్లయితే వరి, గోధుమ, సెనగలు వంటి ప్రధాన పంటలలో కూడా అలాంటి అప్లికేషన్‌లకు దారి సుగమమయ్యేందుకు ఎక్కువ రోజులు పట్టవని భావిస్తు న్నారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన దీపక్ పెంతల్ అనే డెవలపర్ ధార ఆవ హైబ్రిడ్ 11 పేరిట కొత్త ఆవ విత్త నాన్ని రూపొందించారు. ఈ సరికొత్త జీఎం వంగడాలు 30 శాతం అదనపు పంట దిగుబడినిస్తాయని చెప్పారు.ఈ కొత్త వంగడంపై నిర్ణయం తీసుకునేందుకు జన్యు ఇంజనీరింగ్ మదింపు కమిటీ వచ్చేవారం సమా వేశం కానుంది. జీఎం పంటల క్షేత్రస్థాయి నమూనా లకు, వాటి వాణిజ్యపరమైన విక్రయాలకు సంబంధిం చిన అన్ని ప్రతిపాదనలను ఈ కమిటీయే ఆమోదించ వలసి ఉంటుంది.ఇది కేంద్ర పర్యావరణ, అటవీ, వాతా వరణ మార్పు మంత్రిత్వశాఖలో భాగం.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జీఈఏసీ వెబ్ సైట్ మాత్రం ఈ కొత్త వంగడం వివరాలను పొందుప ర్చలేదు. పైగా చాలా సంవత్సరాలుగా ఇది అప్‌డేట్ అవుతున్నట్లు కూడా లేదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితికి సంబంధించి ఈ వెబ్‌ైసైట్‌లో ఉన్న వివరాలు 2007 ఏప్రిల్ నాటి తేదీతో ఉండటం గమనార్హం.

 పత్తి, మొక్కజొన్న, వంకాయ, సెనగలు, వరి, గోధుమ వంటి ఆరు బీటీ వంగడాల క్షేత్రస్థాయి నమూ నాలకు చెందిన 17 అప్లికేషన్లపై చర్చించడానికి జీఈఏసీ ఒక రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా సెప్టెంబర్ 3న నాటి ఎకనమిక్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. సెప్టెంబర్ 3నే జీఈఏసీ రహస్యంగా సమావేశమవుతోం దని, సంబంధిత అప్లికేషన్లపై నిర్ణయాలు కూడా తీసుకో వడం జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని పర్యా వరణ మంత్రిత్వశాఖ అధికారి తెలిపారని ఆ పత్రిక తెలి పింది. మంత్రి ఆమోదం పొందితే కానీ వీటి వివరాలను వెల్లడించలేమని ఆ అధికారి వివరించారు.బీటీ వంగడాలను విచక్షణారహితంగా ప్రోత్సహి స్తున్న భారత ప్రభుత్వాన్ని జీఎం పంటల వ్యతిరేక కార్య కర్త అరుణా రోడ్రిగ్స్ 2013లో భారత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం వెలుగులోకి తీసుకురానున్న సరికొత్త జీఎం వంగడాల పట్ల పాటిస్తున్న గోప్యతను ఆమె తీవ్రంగా ఖండించారు. జీఎం ఆవ విత్తనాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రజలనుంచి, స్వతంత్ర శాస్త్రజ్ఞుల నుంచి పర్యావరణశాఖ అధికారులు పూర్తిగా దాచి పెడుతున్నారని, ఈ క్రమంలో వారు రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వారు ధిక్కరిస్తున్నారని ఆమె ఆరోపించారు. వాస్తవానికి జీవ భద్రతకు సంబంధించిన డేటాను ప్రజలకు అందుబా టులో ఉంచాలని 2008లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది.

 భారతీయ వ్యవసాయరంగంలో జన్యువైవిధ్య పం టలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వం లోపాయి కారీ విధానాలను అవలంబిస్తోం దని, ప్రభుత్వం అను సరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక వైఖరి వల్ల ఈ మొత్తం ప్రక్రి యలో సైన్సుకు, పారదర్శకతకు తావే లేకుండాపోతోం దని దేశీయ పంటల సమర్థకులు ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జన్యు ఇంజనీరింగ్ మదింపు కమిటీ అసాధారణ గోప్యతను అనుసరించడంపై వీరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.జీఎం ఆవ వంగడాల వంటి కొత్త అప్లికేషన్లకు సంబంధించి ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల లోపల ఏం జరుగుతోందన్న విషయం దేశప్రజలకు ఏమాత్రం తెలి యడం లేదని, జీవ భద్రత డేటాను ఇవ్వాల్సిందిగా పదే పదే తాము చేస్తున్న అభ్యర్థనలను రెగ్యులేటరీ సంస్థలు తోసిపుచ్చుతున్నాయని వీరు వాపోతున్నారు. జన్యుప రంగా రూపొందించిన వంగడాలలోని భద్రతపై ప్రభు త్వ రెగ్యులేటర్ సంస్థలు ఇచ్చిన హామీ పూర్తిగా తప్పు అని 2013లోనే సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ తేల్చివేసిన నేపథ్యంలో జన్యువంగడాల భద్రతపై పర్యా వరణ అధికారుల హామీని ఎలా విశ్వసించాలి? జన్యు వంగడాలపై ప్రభుత్వం మరింత నిగూఢత్వాన్ని, అస్పష్ట తను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం సురక్షి తమేనా, శాస్త్రీయమైనదేనా అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

 జన్యు వంగడాల ప్రమాదాన్ని అంచనా వేయ డంలో స్వతంత్ర పరిశోధన, సమగ్రత లోపిస్తున్నందున భారత్‌లో జన్యువైవిధ్య పంటలను ప్రవేశపెట్టడాన్ని  నాలుగు అధికారిక నివేదికలు ఇప్పటికే వ్యతిరేకించాయి. 2010 ఫిబ్రవరిలో జైరామ్ రమేష్ నివేదిక బీడీ వంగ విత్తనాలపై నిరవధిక నిషేధాన్ని ప్రతిపాదించింది.అలాగే సోపారీ కమిటీ నివేదిక, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక, సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదిక కూడా ఇటీవలి కాలంలో జీఎం పంటల క్షేత్ర నమూనాలపై నిరవధిక నిషేధాన్ని సిఫార్సు చేశాయి. ఈ నేపథ్యంలో జీఎం ఆవ వంగడం ప్రాసెస్‌పై, దాన్ని ఆమోదించటంపై తక్షణం జోక్యం చేసుకోవాలని జీఎం ఫ్రీ ఇండియా డిమాండ్ చేసింది. ఇతర జీఎం పంటలకు ఆమోదం తెలిపేందుకే జీఎం ఆవ వంగడాన్ని దొడ్డి దారిన తీసుకువస్తున్నారన్నది స్పష్టమౌతోంది. దేశ వ్యవ సాయరంగం పునాదులను కబళించడానికి వస్తున్న జీఎం పంట వంగడాలను అడ్డుకోవలసిన కర్తవ్యం దేశ ప్రజలందరిదీ.(colintodhunter.com సౌజన్యంతో...)

 కాలిన్ టోడ్‌హంటర్‌తో టికిల్

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top