శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
శ్రీ జయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం, తిథి శు.ఏకాదశి రా.12.15 వరకు
నక్షత్రం రోహిణి ప.3.14 వరకు, తదుపరి మృగశిర
వర్జ్యం ఉ.7.13 నుంచి 8.50 వరకు తిరిగి రా.8.57 నుంచి 10.35 వరకు
దుర్ముహూర్తం ఉ.8.53 నుంచి 9.40 వరకు
తదుపరి ప.12.35 నుంచి 1.26 వరకు
అమృతఘడియలు ప.12.02 నుంచి 1.38 వరకు
సూర్యోదయం: 6.37
సూర్యాస్తమయం: 5.50
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
వృషభం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మిథునం: ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
సింహం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కన్య: బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు.
వృశ్చికం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది.
ధనుస్సు: శుభకార్యాల రీత్యా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులు, సోదరీలతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు.
మకరం: పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు.
కుంభం: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.
మీనం: శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు