వైఎస్సార్‌సీపీకి యుఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

US NRI Wing Supports To YSRCP - Sakshi

 అమెరికా: ఏపీ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్పార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి యుఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ  యుఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బేఏరియా, కాలిఫొర్నియాలో అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వుత్తుల ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ మధులిక మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నిర్వర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక దీక్షలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి పోరాటానికి మద్దతుగా అమెరికా వ్యాప్తంగా హార్ట్‌పోర్ట్‌ సిటి, ఫ్రిమౌంట్‌, డల్లాస్‌, ఫోరిడా, ఓర్లాండోతోపాటు అనేక నగరాల్లో ప్రదర్శనలు  చేసినట్లు తెలిపారు. అమెరాకాలోని తెలుగువారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

 వైఎస్సార్‌సీపి యుఎస్‌ఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కేవీ రెడ్డి మాట్లాడుతూ... జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. హార్డ్‌ఫోర్‌ సిటిలో వైఎస్సాఆర్‌ సీపీ యుఎస్‌ఏ కన్వీనర్‌ రత్నాకర్‌ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రవీణ్‌, సహదేవా, హరిమోయ్యి, త్రిలోక్‌, విజయ్‌, కొండారెడ్డి, శివ, అమర్‌, రాఘవ, వెంకట్‌, నరేంద్ర అట్టునూరి, సుబ్బారెడ్డి భాస్కర్‌, లోకేష్‌, శ్రీధర్‌, రవి కర్రి, వైఎస్సార్‌సీపీ విధ్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top