టీపీఏడీ ఆధ్వర్యంలో కొపెల్‌లో ఎంగిలిపూల బతుకమ్మ

TPAD conducts first day of Bathukamma - Sakshi

కొపెల్‌(డల్లాస్‌) : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో ప్రతికూల వాతావరణంలో కూడా మహిళలందరూ కలిసి ఉత్సాహంగా కొపెల్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం పనిదినం అయినా దాదాపు 200 మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొపెల్‌లో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు స్థానిక పోలీసులు సూచించారు. 

మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నా అవన్నీ లెక్క చేయకుండా ఆండ్రూ బ్రౌన్‌ పార్క్‌లో మహిళలు బతుకమ్మ ఆడారు. ఉద్యోగాల కారణంగా కలుసుకోలేని స్నేహితులు చాలా రోజుల తర్వాత ఒకేచోట చేరి బతుకమ్మపాటలతో సరదాగా గడిపారు. మహిళలు, యువతులు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు.

బతుకమ్మ టీమ్‌ ఛైర్‌ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్‌ మంజూల తోడుపునూరి, టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్‌ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్‌ కమిటీ ఛైర్‌ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్‌, చంద్రా పోలీస్‌, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్‌ 13న అల్లెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో సద్దులు బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top