డెన్మార్క్‌లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు | Telangana Association Of Denmark Celebrated Ugadi In Copenhagen | Sakshi
Sakshi News home page

డెన్మార్క్‌లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Mar 18 2018 7:20 PM | Updated on Mar 18 2018 7:38 PM

Telangana Association Of Denmark Celebrated Ugadi In Copenhagen - Sakshi

కోపెన్ హాగెన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్‌లో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెన్మార్క్‌లో ఉన్న ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు.

ఈ ఉత్సవాలు టాడ్ అధ్యక్షులు సామ సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ పగిళ్ళ, కోశాధికారి జయచందర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వాసు, దాము, రాజారెడ్డి, శివసాగర్, శ్రీనివాస్, రఘు, కరుణాకర్, రాజు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యులు, తదితరుల సహకారంతో వేడుక ఘనంగా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement