వైఎస్‌ జగన్‌ కోలుకోవాలని మక్కాలో ప్రార్థనలు

Special Prayers In Mecca Over YS Jagan Recovery - Sakshi

జెడ్దా(మక్కా): విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌కు అల్లా మరింత శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలందరికి కూడా అల్లా దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ప్రజల కోసం నిరంతరం తపించే జననేతపై గురువారం జరిగిన హత్యాయత్నాన్ని వారు ఖండించారు. దాడి వార్త వినగానే చాలా ఆవేదన చెందామని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన షేక్‌ సలీం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగడం బాధకరమన్నారు. దేశంలోనే మెండుగా ప్రజాదరణ కలిగిన నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. విమానాశ్రయంలో రక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఏపీ మంత్రులు తల తోక లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడటం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే దయ గుణం లేని వారు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భగ్యమని అన్నారు. వారి శాఖలపైన అవగాహన లేని మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. జననేతకు రక్షణ కల్పించమని గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంపైన కుట్ర పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. దాడి చేసిన వ్యక్తికి జైల్లో మర్యాదలు చేస్తూ.. కట్టుకథలు అల్లడం, పోలీసులను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం చంద్రబాబుకే చెల్లిందని సలీం విమర్శించారు. పరామర్శలను కూడా రాజకీయం చేయడం ద్వారా వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందన్నారు. పచ్చ పత్రికలు, అమ్ముడుపోయిన మీడియా ఎంత ప్రయత్నం చేసినా.. నిజం దాగదని పేర్కొన్నారు. వారందరికి అల్లా తగిన బుద్ది చెబుతారని.. ఇలాంటి చౌకబారు చర్యలకు వైఎస్‌ జగన్‌ భయపడరని తెలిపారు. అల్లా దీవెనలు వైఎస్‌ జగన్‌పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన మళ్లీ వైఎస్‌ జగన్‌ రూపంలో రావాలని కోరుతూ.. ఇదే నియ్యత్‌తో తవాఫ్‌ పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో సలీంతో పాటు షేక్‌ అప్సర్‌, మహ్మద్‌ సిరాజ్‌, షేక్‌ ఫరీద్‌లు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top