ప్రజలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు మద్దతుగా నిలవాలి | San Antonio YSRCP Leaders Best Wishes To YS Jagan | Sakshi
Sakshi News home page

Nov 14 2018 11:36 AM | Updated on Nov 14 2018 11:59 AM

San Antonio YSRCP Leaders Best Wishes To YS Jagan - Sakshi

టెక్సాస్‌: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ దిగ్విజయంగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టెక్సాస్‌ రాష్ట్రం శాన్ అంటోనియో నగరంలోని ఆ పార్టీ అభిమానులు అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం అందరికి తెలిసిందేనని అన్నారు. తనపై హత్యాయత్నం జరిగిన అవేమీ లెక్కచేయకుండా, ప్రజలకిచ్చిన మాట కోసం జననేత మడమ తిప్పకుండా ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం తపిస్తు, ప్రజల మధ్యలో ఉండే వైఎస్‌ జగన్‌కు ప్రజలు, కార్యకర్తలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అభిమానులు వేణుగోపాల్‌ రెడ్డి కొత్తపల్లి, పరమేశ్వరరెడ్డి నంగి, ఆదినారాయణ రెడ్డి లక్కు, రెడ్డిభాస్కర్‌ రెడ్డి బండ్లపల్లి, సునీల్‌కుమార్‌రెడ్డి మేడ, రాజశేఖర్‌రెడ్డి మాకిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, నరసింహారావు, అంజన్‌ రెడ్డి శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement