
డల్లాస్ : ప్రముఖ నాట్య కళాకారిణి ప్రనమ్య సూరీ నాట్య ప్రదర్శన డూప్రీ థియోటర్‌లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్‌లో ఆదివారం జరిగింది. ‘‘లాస్య గతిక’’ అనే నాట్య రూపకాన్ని ఆమె ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి, గురువు డా. శ్రీలతా సూరీ హాజరయ్యారు. ప్రణమ్యా సూరి పలు ప్రతిష్టాత్మకమైన వేదికలమీద నాట్యప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో నాట్యంజలి డాన్స్ ఫెస్టివల్ (చిదంబరం), దేవదాసి నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ (భువనేశ్వర్,) కజురాహో ఫెస్టివల్, కోనార్క్ డాన్స్ ఫెస్టివల్, సుర్ సింగర్ సంసద్ & హరిదాస్ సమ్మెలన్ (ముంబై), వివిద ఐసీసీఆర్ కార్యక్రమాలు ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శించారు.
ఢిల్లీ, కటక్, వైజాగ్, మంగ్లోర్, హైదరాబాద్, కుచిపుడి నృత్యోత్సవ్, నాడా నీరజనమ్ (తిరుమల) తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె పలు అవార్డులు అందుకున్నారు. నాట్య విశారద, శృంగార మణి, నలంద నృత్య నిపున, నాట్య సరధి, యువరత్న తదితర ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఈమె ఎకోస్ ఆఫ్ ఇండియా లాంటి పలు ఎన్‌జీఓ సంస్థలను స్థాపించడమే కాకుండా నృత్య ప్రదర్శన చేస్తు విరాళాలు సేకరిస్తున్నారు.