న్యూజెర్సీలో ఓవర్సీస్ అఫ్ బీజేపీ మీట్‌ అండ్‌ గ్రీట్‌

OVERSEAS FRIENDS OF BJP meet and greet held in newjersy - Sakshi

న్యూజెర్సీ : న్యూ జెర్సీ ఎడిసన్‌లోని గోదావరి హోటల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్‌ అఫ్ బీజేపీ వారి ఆధ్వర్యములో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భాంగా కేంద్రంలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిపై చర్చించారు. 

కాంగ్రెస్ పార్టీ అంతా ఓ కుటుంబంపై ఆధారపడి ఉందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. అదే విధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోను రెండు కుటుంబాలు తమ ఇష్టమొచ్చినట్లు పాలిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వారికి ఓటర్లు తగిన బుద్ధి చెపుతారని తెలిపారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడే భారత్‌ వెళ్లి ప్రచారం ప్రారంభించారని ఓవర్సీస్ ఫ్రెండ్స్‌ అఫ్ బీజేపీ అధ్యక్షులు క్రిష్ణారెడ్డి తెలిపారు. మోదీ పాలనకు ముందు 6 రాష్ట్రాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే 29 రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top