ఎన్‌ఆర్‌ఐలు.. బ్యాంకు అకౌంట్లు

Nri Accounts in India - Sakshi

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత దేశంలో పలు రకాల బ్యాంకు ఖాతాలు కలిగి ఉండవచ్చు. 

ఎన్ఆర్ఇ (నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఇ అకౌంట్‌ను భారత కరెన్సీలో నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలోకి విదేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం ద్వారా మాత్రమే డబ్బు జమచేయవచ్చు. తన సంపాదనను ఇందులోకి బదిలీ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బును తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు.  

ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఓ అకౌంట్‌ను భారత దేశంలోని లావాదేవీల కొరకు ఉపయోగించవచ్చు. భారత్ లో వచ్చిన ఆదాయాన్ని ఇందులో జమ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయం పై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బు ద్వారా వచ్చిన వడ్డీని తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. అసలు ను కొన్ని నిబంధనలకు లోబడి వాపస్ తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు లేదా ఒక ఎన్‌ఆర్‌ఐ తోపాటు భారత్ లో ఉన్న మరొకరితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. 

ఎఫ్ సి ఎన్ ఆర్ డిపాజిట్ అకౌంట్: పారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ ఖాతాలను అమెరికన్ డాలర్, బ్రిటన్ పౌండ్, యూరో, స్విస్ ప్రాంక్, సింగపూర్ డాలర్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, హాంగ్ కాంగ్ డాలర్, జపాన్ యెన్ లాంటి 9 విదేశీ కరెన్సీలలో నిర్వహించుకోవచ్చు. 

ఆర్ ఎఫ్ సి (రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ) అకౌంట్:  ఎన్‌ఆర్‌ఐలు భారత దేశానికి వాపస్ వచ్చిన సందర్భంలో వారి ''ఎన్‌ఆర్‌ఐ హోదా'' కోల్పోతారు. ఈ సందర్భంలో వారు ఈ ఖాతా ను తెరవవచ్చు. అమెరికన్ డాలర్, బ్రిటిష్ పౌండ్ లలో ఈ ఖాతాను నిర్వహించుకోవచ్చు. మళ్ళీ ఎన్‌ఆర్‌ఐ హోదా పొందిన తర్వాత ఈ ఖాతాలో డబ్బును ఎంఆర్ఇ లేదా ఎఫ్ సి ఎన్ ఆర్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు.  
 
                                                                          -మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top