సామాజిక సేవా కార్యక్రమాల్లో నాట్స్ | NATS members services to Habitat for Humanity ReStores | Sakshi
Sakshi News home page

సామాజిక సేవా కార్యక్రమాల్లో నాట్స్

May 9 2018 10:24 AM | Updated on May 9 2018 10:24 AM

NATS members services to Habitat for Humanity ReStores - Sakshi

టెంపా, ప్లోరిడా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) టెంపాలోని ప్లోరిడాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. భాషే రమ్యం సేవే గమ్యం అని నినదించే నాట్స్
తాజాగా ప్లోరిడాలో హాబిటేట్స్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ అనే సంస్థ కోసం తన వంతు సేవలు అందించింది. పేదల కోసం ఇళ్లు, ఇంట్లో సామానులు, ఇతర వసతి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా హాబిటేట్స్ ఫర్
హ్యూమానిటీ అనే సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు చాలా మంది విరాళాలు, వివిధ రకాల వస్తువులు అందించడంతో పాటు తమకు తోచిన సేవలను కూడా ఉచితంగా అందిస్తారు. 

ఈ క్రమంలోనే నాట్స్ కూడా తన సేవలను అందిచేందుకు నడుంబిగించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ సభ్యులు.. ఈ సంస్థలో టాప్స్, టేబుల్స్  కోసం తమ విలువైన సేవలను అందించారు. రోజువారీ పనుల్లో ఎంతో బీజీగా గడిపే నాట్స్ సభ్యులు హాబిటేట్ ఫర్ హ్యూమానిటి రిస్టోర్లో అనేక పనులు చేసి పేదల పట్ల తమకు ఉండే ప్రేమను చాటుకున్నారు. పేదలకు అందించే వస్తువులను సిద్ధం చేయడంలో ఎంతో సంతృప్తినిచ్చిందని నాట్స్ టెంపా బే ఛాప్టర్ సభ్యులు తెలిపారు. హబిటేట్ ఫర్ హ్యూమానిటీ రిస్టోర్ వేర్ హౌస్ ను క్లీనింగ్ కూడా చేసి ఆ సంస్థ ప్రశంసలను నాట్స్ సభ్యులు పొందారు.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement