న్యూజెర్సీలో నాట్స్ తెలుగు సంబరాల సన్నాహక సమావేశం

NATS Convention 2019 Curtain Raiser held in New Jersey - Sakshi

న్యూ జెర్సీ: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూజెర్సీలో నాట్స్  నిర్వహించించిన తెలుగు సంబరాలు 2019 కర్టన్ రైజర్ అండ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. స్థానికంగా ఉండే తెలుగు వారు మేము సైతం తెలుగు సంబరాల్లో పాల్గొంటామని ముందుకొచ్చారు. దాదాపు 500 మంది తెలుగువారు ఈ ఈవెంటు కు హాజరయ్యారు. డాలస్ లో ఇర్వింగ్ వేదికగా  మే 24 నుంచి 26 తేదీల్లో జరగనున్న సంబరాలకు వచ్చే తెలుగు అతిరథ మహారథుల గురించి  నాట్స్  మాజీ అధ్యక్షులు, నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహన కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు తెలుగువారంతా సహకరించాలని కోరారు. నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని వివరించారు. సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అమెరికాలో తెలుగు జాతికి ఎంత అండగా నిలబడుతుందనేదిఉదాహరణల లతో సహా ఆడియో వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాట్స్ ఉపాధ్యక్షుడు రమేశ్ నూతలపాటి నాట్స్ కోసం విరాళాలు అందిస్తున్న దాతల పేర్లను ప్రకటించారు. ఈ సంబరాల ఫండ్  రైజింగ్ ఈవెంట్ కు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు నాలుగు లక్షల డాలర్లను సంబరాలకు నాట్స్ సేకరించింది. నాట్స్ జాయింట్ సెక్రటరీ రంజిత్ చాగంటి ఈ ఈవెంట్ కు స్పానర్స్ గా వ్యవహారించిన న్యూయార్క్ లైఫ్ కు చెందిన లక్ష్మి మోపర్తి, యూఎన్ఓ ఫైనాన్షియల్స్ వెంకటరాజా, కీర్తిక పర్వతనేని, మనీ టూ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ రిప్రంజేటేటివ్స్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇటీవలే మిస్ టీన్ ఇండియా యూఎస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈషా కోడెను నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్యాం నాళం వేదిక మీదకుఆహ్వానించారు. నాట్స్ మాజీ ఛైర్మన్లు, మధు కొర్రపాటి, శ్యాం మద్ధాళి, నాట్స్ వైఎస్  ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తదితరులు ఈషా కోడెను ఘనంగా సన్మానించారు. మోహన కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ బాధితులకు న్యాయ సాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ జొన్నలగడ్డను నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వంశీ వెనిగళ్ల సభకు పరిచయం చేశారు. తెలుగు విద్యార్ధులకు ఆపద సమయంలో కీలకమైన సలహాలు ఇచ్చిన శ్రీనివాస జొన్నలగడ్డను నాట్స్ ఘనంగా సన్మానించింది. ప్రసాద్ సింహాద్రి, సుందరీలు ఈ ఈవెంట్ ఆద్యంతం పాటలతో వినోదం నింపారు. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ విష్ణు ఆలూరు ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top