ఎన్నికల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన కపిల్ సిబాల్

Kapil Sibal attends India overseas congress meeting in London - Sakshi

లండన్ : ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన  చర్చాగోష్ఠి కార్యక్రమంలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ యూకే అండ్‌ యూరోప్ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ..దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ దిగజారుస్తుందని మండిపడ్డారు. అర్ధరాత్రి నిర్ణయాలు దేశ ప్రజలను చీకట్లోకి నెట్టేస్తున్నాయన్నారు. రాఫెల్ కుంభకోణం దేశ ప్రజలకు
చేరవేయాలని కోరారు. ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజల సందేహాలను పరిగణలోకి తీసుకొని పేపర్ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సుధాకర్ గౌడ్, మంగళరపు శ్రీధర్, అడ్వైజరీ బోర్డు సభ్యులు గంగసాని ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి మడెలవిడు, వేముల మణికంఠ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సీనియర్  ఉపాధ్యక్షురాలు గుర్మిందర్‌లు పాల్గొన్నారు . 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top