
ఇల్లినాయిస్ : డొమినికన్ రిపబ్లిక్‌లో ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నారులకు సహాయాన్ని అందించడానికి చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ), ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్(ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీ)లు ముందుకొచ్చాయి. చికాగోలో 175 మంది వాలింటీర్లు కలిసి ఆహారాన్ని వండి, 2,85,00 మీల్స్ ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. సీటీఏ ఆధ్యక్షులు నాగేంద్ర వేగె ఆధ్యక్షతన ఇల్లినాయిస్‌లో నేపర్‌విల్‌లోని నార్త్ సెంట్రల్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. ప్యాక్ చేసిన ఆహారపొట్లాలను డొమినికన్ రిపబ్లిక్‌లో పోషకాహార లోపంతో బాధపుడుతున్న చిన్నారులకు వితరణ చేయనున్నారు.
సీటీఏ వ్యవస్థాపక సభ్యులు రవి ఆచంట, ప్రవీణ్ మోతూరు, శేషు ఉప్పలపాటి, రావు ఆచంట, కోర్ సభ్యులు భూషణ్ భీమ్ శెట్టి, దేవ సుబ్రమణ్యం, వేణు ఉప్పలపాటి, ఫరీద్ ఖాన్, హరీష్ జన్ను, అదిల్ అహ్మద్, బాల చోడ, ముహ్మద్ రెహ్మాన్, భార్గవ్ కావూరి, కళ్యాణ్ కరుమురి, పవన్ నారం రెడ్డి, సూర్య గర్డె, భాను సోమ, విజయ్ బాబు క్రిష్ణ మూర్తి, రఘురెడ్డి, మురళి పర్మి, రాహుల్ వీరటపు, క్రిష్ణ రంగరాజు, సీటీఏ మహిళా సభ్యులు రాణి వేగె, భవాని సరస్వతి, మౌనిక చేబ్రోలు, మాధవి తిప్పిశెట్టి, తనుజా సజ్జ, సుధా కుంచనపల్లి, సుజనా ఆచంట, మాధవి ఆచంట, పూర్ణిమ, కవిత, శ్రీలక్ష్మి మందవలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమవంతు సహకారాన్ని అందించారు. గత కొన్నేళ్లుగా సీటీఏ అందిస్తున్న సహకారాన్ని ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీ సభ్యులు కొనియాడారు.