నేపాల్లో జరిగే అంతర్జాతీయ వలసల శిక్షణకు బషీర్

Basheer selected for Diplomacy Training program in Kathmandu - Sakshi

ఖాట్మండు : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి గల్ఫ్ వలసల భాగస్వామ్య వ్యూహాల శిక్షణకు వరంగల్ జిల్లాకు చెందిన తమ సంస్థ సభ్యుడు మహ్మద్ బషీర్ అహ్మద్ కు ఆహ్వానం అందిందని ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒమన్‌ దేశంలోని మస్కట్ లో 12 సంవత్సరాలపాటు ఉపాధ్యాయులుగా పనిచేసిన బషీర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (తెలంగాణ ప్రవాసి వేదిక) లో  రిటర్న్‌డ్‌  ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ (విదేశాల నుండి తిరిగి స్వదేశం వచ్చిన నిపుణులు) విభాగానికి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే 'డిప్లొమసి ట్రేనింగ్ ప్రోగ్రాం',  ఫిలిప్పీన్స్ లోని మనీలా కేంద్రంగా పనిచేసే 'మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా',  నేపాల్ లోని ఖాట్మండు కేంద్రంగా పనిచేసే 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ సేఫ్ మైగ్రేషన్' అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ (గల్ఫ్ కు వలసలు వెళుతున్న ప్రాంతాలు) లో పనిచేసే సివిల్ సొసైటీ అడ్వొకేట్స్ సమీక్ష కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి వివిధ దేశాల నుండి పలువురు వలస కార్మిక నాయకులు, సమాజ సేవకులను ఆహ్వానించారు. కార్మికులను పంపే దేశాలు, కార్మికులను స్వీకరించే దేశాల మధ్య సమర్థవంతమైన వలసల భాగస్వామ్య వ్యూహాలపై ప్రధానమైన చర్చ జరుగుతుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top