టేకు అక్రమరవాణా కేసు:ఐదుగురి రిమాండ్‌

five members arrested for teak timber smuggling - Sakshi

టేకు అక్రమ రవాణా కేసులో.. 

వివరాలు వెల్లడించిన ఏసీపీ సుదర్శన్‌

మాక్లూర్‌ : మండలంలోని చిక్లీ గ్రామ శివారులో అక్రమంగా టేకు కలప రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్‌ ఏసీపీ సుదర్శన్‌ తెలిపారు. మాక్లూర్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ మండలంలోని సారంగపూర్‌ గ్రామంలోని డైయిరీ ఫారంకు చెందిన షేక్‌వాజీద్, అప్సర్‌ఖాన్, మహమ్మద్‌ అతీక్, మహబూబ్, ఆటోనగర్‌కు చెందిన షకీల్‌ అనే ఐదుగురు వ్యక్తులు మండలంలోని చిక్లీ క్యాంపుకు చెందిన ప్రభాకర్‌రావు, చిక్లీ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి, నవీపేట మండలంలోని హన్‌మాన్‌ ఫారంకు చెందిన ప్రతాప్‌రెడ్డి పొ లాల్లో నుంచి గతేడాది నుంచి టేకు చెట్ల ను నరికేసి రాత్రి వేళలో టేకు దుంపల ను వ్యాన్‌లో తరలించేవారన్నారు. బాధితులు మాక్లూర్‌ పోలీసులకు ఫిర్యాదు చే శారన్నారు. మంగళవారం చిక్లీ గ్రామ శి వారులో వాహనాలు తనిఖీ చేస్తున్న స మయంలో వ్యాన్‌ను అపి తనిఖీ చేయగా రూ.2లక్షల 50వేలు విలువైన టేకు కలప, వ్యాన్‌ను పట్టుకుని సీజ్‌ చేశామాన్నారు. నిందితులను విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారన్నారు. సమావేశంలో సీఐ బుచ్చయ్య, ఎస్సై రామునాయుడు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
 

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top