నిందితులపై వేధింపులకు పాల్పడితే జైలు! | YSRCP MP Vijaya Sai Reddy on private bill | Sakshi
Sakshi News home page

నిందితులపై వేధింపులకు పాల్పడితే జైలు!

Dec 25 2017 4:45 AM | Updated on Aug 9 2018 4:22 PM

YSRCP MP Vijaya Sai Reddy on private bill - Sakshi

న్యూఢిల్లీ: నిందితులు, అనుమానితుల నుంచి నిజాల్ని రాబట్టడానికి వేధింపులకు పాల్పడే పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఒక ప్రైవేట్‌ బిల్లులో ప్రతిపాదించారు. వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాలు పరిహారం కూడా వసూలు చేయాలని అందులో పేర్కొన్నారు. హింస నిరోధక బిల్లు–2017 పేరిట విజయసాయి రెడ్డి ప్రతిపాదించిన బిల్లులో...కస్టడీలో ఉన్న నిందితుడిని బలవంతంగా నేరం చేసినట్లు ఒప్పించడానికి లేదా నేరానికి సంబంధించిన సమాచారం రాబట్టడానికి హింసకు పాల్పడే వారిని శిక్షించాలని ప్రతిపాదించారు. భారత్‌లో హింసా వ్యతిరేక చట్టం లేకపోవడంతో ఇతర దేశాల నుంచి నేరగాళ్లను రప్పించే ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement