బెజవాడ విల్సన్కు వైఎస్ జగన్ అభినందనలు | ys jagan wishes to ramon magsaysay award winner bezwada wilson | Sakshi
Sakshi News home page

బెజవాడ విల్సన్కు వైఎస్ జగన్ అభినందనలు

Jul 27 2016 10:01 PM | Updated on Jul 25 2018 4:09 PM

బెజవాడ విల్సన్కు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

బెజవాడ విల్సన్కు వైఎస్ జగన్ అభినందనలు

బెజవాడ విల్సన్కు రామన్ మెగసెసె అవార్డు లభించడంపై వైఎస్ జగన్‌ అభినందనలు తెలిపారు.

హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విల్సన్ చేసిన సేవలకు ఈ అవార్డు వచ్చిందన్నారు. ఆయన సేవలను వైఎస్ జగన్ కొనియాడారు.

కర్ణాటకలో ఓ దళిత కుటుంబంలో జన్మించిన విల్సన్‌ దళిత కార్మికుల కోసం 'సఫాయి కర్మచారి ఆందోళన్‌' సంస్థను ప్రారంభించి వారి కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన విద్యాభ్యాసం ఆంధ్రపద్రేశ్‌లో కొనసాగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement