ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్‌' సైకత శిల్పం | World's 'tallest' sand Santa stands at Puri beach | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్‌' సైకత శిల్పం

Dec 24 2015 8:57 PM | Updated on Aug 28 2018 8:41 PM

ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్‌' సైకత శిల్పం - Sakshi

ప్రపంచంలో ఎత్తైన 'శాంటాక్లాజ్‌' సైకత శిల్పం

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో 45 అడుగుల ఎత్తైన శాంటాక్లాజ్‌ సైకితశిల్పాన్ని గురువారం ఏర్పాటుచేశారు.

పూరి: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో 45 అడుగుల ఎత్తు ఉన్న శాంటాక్లాజ్‌ సైకతశిల్పాన్ని గురువారం ఏర్పాటుచేశారు. 'ప్రపంచశాంతి' అనే సందేశంతో శాంటాక్లాజ్‌ను రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. దాంతో ఆయన రూపొందించిన ఈ సైకత శిల్పం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శాంటాశిల్పంగా గుర్తింపుపొందనుంది. ఈ శిల్పాన్ని రూపొందించడానికి వేయి టన్నుల ఇసుకను వివిధ వర్ణాల రంగులతో ఉపయోగించినట్టు సుదర్శన్‌ వెల్లడించారు.

ఇందుకోసం పూరిలోని ఆయన శాండ్ ఆర్ట్‌ ఇన్స్టిట్యూట్లో 20మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. దీన్ని సరైన ఆకృతిని రూపొందించడానికి వారికి రెండు రోజల్లో 22 గంటల పాటు సమయం పట్టింది. ఈ రోజు నుంచి జనవరి 1 వరకు శాంటా సైకిత శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. అదేవిధంగా సుదర్శన్‌ యేసు‌, మేరీ మాతల సైకత శిల్పాలను కూడా రూపొందించారు. అంతేకాక తన సైకత శిల్పాలను 'లిమ్కా బుక్' రికార్డ్స్‌లో చేర్చాల్సిందిగా వారిని పట్నాయక్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement