అందంగా లేడని.. రుబ్బు రోలుతో.. | Woman killed husband for not being handsome | Sakshi
Sakshi News home page

అందంగా లేడని.. రుబ్బు రోలుతో..

Apr 11 2017 5:29 PM | Updated on Jul 30 2018 8:37 PM

అందంగా లేడని.. రుబ్బు రోలుతో.. - Sakshi

అందంగా లేడని.. రుబ్బు రోలుతో..

భర్త అందంగా లేడని తీవ్ర అసంతృప్తి చెందిన ఓ నవ వధువు పెళ్లయిన వారం రోజులకే అతడిని దారుణంగా చంపేసింది.

కడలూరు: భర్త అందంగా లేడని తీవ్ర అసంతృప్తి చెందిన ఓ నవ వధువు పెళ్లయిన వారం రోజులకే అతడిని దారుణంగా చంపేసింది. తమిళనాడు రాష్ట్రం కడలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకుడు(25)తో వారం రోజుల క్రితం యువతి(22)కు వివాహమయింది. పెళ్లయిన మరుసటి రోజు నుంచి ఆమె చాలా అసంతృప్తితో ఉంటోంది.

భర్త ఆమెకు సరైన జోడు కాడని ఆమె స్నేహితులు, బంధువులు అంటుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భర్తతో గొడవ పడింది. తీవ్ర కోపంతో ఉన్న ఆమె భర్త తలపై రుబ్బు రోలుతో కొట్టి చంపేసింది. మంగళవారం ఉదయం తన భర్తను ఎవరో చంపేశారంటూ పెద్ద పెట్టున రోదించ సాగింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు విచారించి.. నవ వధువే నిందితురాలని తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement