ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది! | woman gets husband killed, heard screams in phone | Sakshi
Sakshi News home page

ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది!

May 29 2017 3:25 PM | Updated on Sep 5 2017 12:17 PM

ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది!

ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది!

ఏడాది క్రితమే ఆమెకు పెళ్లయింది. కానీ అంతకంటే చాలా ముందు నుంచే ఒక ప్రియుడున్నాడు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడైన భర్తకు బదులు రెండేళ్లు చిన్నవాడైన ప్రియుడితో కలిసి ఉండటమే ఆమెకు నచ్చింది.

ఏడాది క్రితమే ఆమెకు పెళ్లయింది. కానీ అంతకంటే చాలా ముందు నుంచే ఒక ప్రియుడున్నాడు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడైన భర్తకు బదులు రెండేళ్లు చిన్నవాడైన ప్రియుడితో కలిసి ఉండటమే ఆమెకు నచ్చింది. అందుకే అతడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. సమయానికి తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. భర్త చావుకేకలను ఫోన్లో విని సంతోషించింది. మనువా మజుందార్ (28) అనే ఆ మహిళ పశ్చిమబెంగాల్‌లోని బరసాత్ మునిసిపాలిటీలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త అనుపమ్ సిన్హా (34) ఒక ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్. కానీ, అజిత్ రాయ్ (26) ఆమెకు కాలేజి రోజుల నుంచి తెలుసు. అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుని, భర్త హత్యకు పక్కాగా ప్లాన్ చేసింది.

అనుపమ్‌ ఉండే ఫ్లాట్‌లోకి ముందుగానే మనువా ఇచ్చిన తాళాలతో చేరుకున్న అజిత్.. అతడు లోపలకు రాగానే ఒక ఇనుప రాడ్‌తో తలమీద కొట్టాడు. ఆ తర్వాత అదే రాడ్‌ను అతడి గొంతులోకి పోనిచ్చి, మనువాకు ఫోన్ చేశాడు. చావు భయంతో అతడు పెడుతున్న కేకలను విన్న మనువా.. మిగిలిన పని కూడా కానించేయమని ప్రియుడికి చెప్పింది. దాంతో అతడు మెదడులో నరాలను కత్తితో కోసి మరీ దారుణాతి దారుణంగా అనుపమ్ సిన్హాను హతమార్చాడు. అనుపమ్ మరణించాక, అపార్టుమెంటు అంతటినీ అజిత్ శుభ్రం చేశాడు. తర్వాతిరోజు గంగానదిలో స్నానం చేసి, రక్తంతో తడిసిన తన దుస్తులను, అనుపమ్ సెల్‌ఫోన్‌ను నదిలోకి విసిరేశాడు.

తాము ఇలాంటి హత్యలు చాలా చూశాం గానీ, ఇది మాత్రం తమకు పెద్ద షాకని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రెండు వారాల తర్వాత ప్రేయసీ ప్రియులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కావాలంటే ఆమె విడాకులు తీసుకుని తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఉండచ్చు గానీ, భర్తను అంత క్రూరంగా చంపించడం ఎందుకని పొరుగున ఉండే రాత్రి రాయ్ అనే మహిళ ప్రశ్నించారు. తన భార్య ప్రేమ విషయం అనుపమ్‌కు తెలిసిందని, ఆమెను తాను పెళ్లి చేసుకుని ఉండాల్సింది కాదంటూ తరచు వాపోయేవాడని అనుపమ్ సహోద్యోగి అభిషేక్ చటర్జీ అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మనువా మాత్రం చాలా కూల్‌గా ఉండటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement