బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్‌!

West Bengal BJP Leader Daughter Allegedly Kidnapped - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్‌ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్‌పూర్‌కు చెందిన సుప్రభాత్‌ బత్యబయాల్‌ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్‌ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్‌ కూతురిని కిడ్నాప్‌ చేశారు.

ఈ విషయం గురించి సుప్రభాత్‌ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్‌ అవడంతో లబ్ధ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు.

ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్‌భూమ్‌ జిల్లా ఎస్పీ శ్యామ్‌ సింగ్‌ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top