కావాలంటే సుప్రీంకు వెళ్లండి: ఎన్జీటీ | We Do Not Review The Verdict On Amaravati Construction Says NGT | Sakshi
Sakshi News home page

Jul 20 2018 5:01 PM | Updated on Jul 20 2018 5:01 PM

We Do Not Review The Verdict On Amaravati Construction Says NGT - Sakshi

అమరావతి (పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. షరతులకు లోబడి పర్యావరణానికి విఘాతం కలగకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని తన తుది తీర్పులో పేర్కొంది. అయితే, ఆ తీర్పును పునఃపరిశీలించాలని ఈఏఎస్‌ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో  పిటిషన్‌ వేసిన వేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరిగాలేవనీ, అమరావతిలో నిర్మాణాలు ఆపాలని పిటిషనల్‌లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ ఈ పిటిషన్‌పై స్పందించింది. రాజధానిలో నిర్మాణాలు ఆపాలని లేవనెత్తుతున్న అంశాలతో పిటిషనర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కానీ, ఎన్జీటీ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement